పుట:Adhunikarajyanga025633mbp.pdf/61

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నిర్మింపజేసెను. ఆసమయమందు కొన్నిపక్షములవారు తిరిగి పురాతన రాజవంశీయులగు బూర్బనువారి రాజ్యమేర్పరచ వలెననియు, మరికొందరు నెపోలియను వంశీయుల గద్దెపైనెక్కించ వలెననియు, మిగతా వారురిపబ్లికు నేర్పరచవలెననియు ఉత్సాహులైయుండిరి. అందరు తాత్కాలికావసరములకొరకే ఈ మూడుచట్టముల నంగీకరించిరి. తుదకు ఆరాజ్యాంగ విధానమే శాశ్వతమైనది. అప్పటి పార్టీలవారు ఎప్పుడు తమకు వీలుకల్గిన అప్పుడు తిరిగి తమకిష్టమగు రాజును దెచ్చుకొనుటకు వీలగుటకై రాజ్యాంగవిధానమును సవరణచేయుటకు సులభమార్గము నేర్పరచిరి. శాసనసభలు రెండును (డెప్యూటీలసభ, సెనెటుసభ) వర్సైల్సు పట్టణమందు సమావేశమై అధిక సంఖ్యాకులగు సభ్యుల యామోదముపై రాజ్యాంగ విధానమునందు సవరణల జేయవచ్చుననిరి. కాని 1884 వ సంవత్సరమున అంగీకరింపబడిన సవరణప్రకారము రిపబ్లికును మార్చుటకు వీలు లేకుండ జేయబడినది.

పోలాండు కడుంగడు పురాతనమగు దేశము. క్రీ. శ. 1791 పూర్వము ఎన్నుకొనబడిన రాజుల పాలనము సాగుచుండెను.

4. పోలాండు
రాజ్యాంగము

ఆసంవత్సరమున రాజ్యము వంశ పారంపర్యాయమగు హక్కుకలరాజులపాలాయెను. పిదప రషియా, జర్మనీ, ఆస్ట్రేలియా రాజ్యముల మధ్య పంచబడి బానిసత్వము ననుభవింపవలసి వచ్చెను. తుదకు యుద్ధానంతరము స్వాతంత్ర్యముపొంది 1920 వ సంవత్సరమున రిపబ్లికుగా నేర్పడి రాజ్యాంగవిధానపు చట్టమును