పుట:Adhunikarajyanga025633mbp.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్కులగు స్త్రీపురుషులెల్లరకు ప్రసాదించుట కేర్పరుపబడిన శాసనములన్నియు సాధారణ పద్ధతుల ననుసరించియే పార్లమెంటు అంగీకరించియున్నది. రాజుయొక్క పెత్తనమును సంకుచితపఱచచూ ప్రజలయొక్కయు, పార్లమెంటుయొక్కయు హక్కుల నిద్ధారణజేయు 1689 వ సంవత్సరపు శాసనమును; ప్రభువులసభకు అప్పటివరకు కామన్సు సభవారితోపాటు సమానముగాయుండిన శాసననిర్మాణాధికారమును తగ్గించిన 1911 వ సంవత్సరపు శాసనమును; పార్లమెంటుచే సాధారణ శాసనములవలెనే నిర్మింపబడినవి. ఇటుల సవరణలను కాలానుగుణముగా జేయుటకు సంపూర్ణ సౌలభ్యతను ఇంగ్లీషువారి రాజ్యాంగవిధానము సాధ్యపరచుచున్నది.

న్యూజీలాండుయొక్క రాజ్యాంగవిధానము కూడ యీవిధముగనే, సాధారణ శాసననిర్మాణపద్ధతుల ననుసరించియే, శాసనసభాసభ్యులు తలచుకొనుచో అతిసులభముగా, ప్రత్యేకపు టేర్పాటులేమి యగత్యము లేకనే, సవరింపబడుటకు అవకాశముకలదు. క్రీ. శ. 1852 సంవత్సరమందు బ్రిటిషుపార్లమెంటువారిచే నిర్మింపబడిన శాసనము ప్రకార మీదేశపు రాజ్యాంగవిధానము యేర్పడెను. అప్పటికి అమలునందున్న రాష్ట్రీయప్రభుత్వములు, వానిశాసనసభలు, ఈ చట్టము ననుసరించియే తమ కార్యములనడపు చుండెను. ఈచట్టమునందే, న్యూజీలాండుదేశపు కేంద్రశాసనసభకు