పుట:Adhunikarajyanga025633mbp.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విధానమును సవరణచేయుట సాధ్యమగుచో అట్టివిధానము "పెళుసు" (Rigid) పొందినదందురు. ఇంగ్లాండు దేశముయొక్కయు, ఇటలీ దేశము యొక్కయు, న్యూజీలాండు యొక్కయు, ఫిన్ లాండు యొక్కయు రాజ్యాంగవిధానములు ప్రధమతరగతికి జెందినవి. ఫ్రాన్సు, అమెరికా, స్విట్జర్లాండు, కెనడా, ఆస్ట్రేలియా, ఐరిషుఫ్రీస్టేటు దేశముల రాజ్యాంగ విధానములు రెండవతరగతికి జెందినవి.

ఇంగ్లాండునందిప్పటివరకు సాధారణముగానుండు శాసనముల పార్లమెంటు యెట్లు నిర్మించుచున్నదో అటులనే రాజ్యాంగ

1. ఇంగ్లాండు
యొక్క
రాజ్యాంగము.

విధానమునందలి మార్పులనుకూడ గల్గించుచున్నది. అట్టిమార్పుల జేయుటకు ముందుకాని, పిమ్మటకాని ప్రజాభిప్రాయము కన్గొనుటకై "రిఫరెండము" నేర్పరచుట కగత్యము లేదు. ఆమార్పుల నంగీకరించుటకు సాధారణ పరిస్థితులం దెట్లు అధికసంఖ్యాకుల కుమ్మక్కి యవసరమో అటులనే తప్ప అంతకుమించిన ప్రత్యేక ఆమోదప్రదర్శన మగత్యము లేదు. ఏది శాసనము, ఎయ్యది రాజ్యాంగవిధానము నేమార్పు జేయు సవరణ, యను విచక్షణ ప్రత్యేకముగా పార్లమెంటుచేయ నక్కరలేదు. ఇందువలననే రాజ్యాంగాధికారము భూస్వాముల నుండి పట్టణవాసులకు, పిమ్మట కార్మికులకు, అంతట యుక్తవయస్కులగు పురుషులెల్లరకు, యుద్ధానంతరము యుక్తవయ