పుట:Adhunikarajyanga025633mbp.pdf/58

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రాజ్యాంగవిధానమును సవరణజేయుట కధికారము ప్రసాదించబడెను. ఈయధికారరీత్యా 1876 వ సంవత్సరమందు రాష్ట్రీయరాజ్యముల నెత్తివేసి, న్యూజిలాండుకు కంతకొకేరాజ్యము నేర్పరచుచూ, ఆదేశపు శాసనసభవారు శాసించిరి. ఈవిధముగా న్యూజీలాండుదేశపు "ప్రతినిధిసభ" వారు బ్రిటిషువారి పార్లమెంటువలెనే రాజ్యాంగవిధానమును మార్పుజేయుటకు సంపూర్ణధికారమును పొందియున్నారు.

ఇటలీసంగతి ప్రత్యేకముగా చెప్ప నగత్యమే కానరాదు. ఆదేశపు రాజ్యాంగవిధానమును, సాధారణశాసనము ద్వారా

2. ఇటలీ.

'శాసనసభ' వారు మార్చివేయవచ్చును. రాజ్యాంగవిధానపు చట్టముయొక్క ప్రధమ నియమముప్రకారము, రోమను కాధలిక్కుమతమే రాజ్యాంగపుమతమైయుండ, దానికి వ్యతిరేకముగా అనేక మార్పుల కల్గించుచూ, పార్లమెంటు శాసనముల నిర్మించెను. నిరంకుశాధికారము స్థాపించిన శ్రీముస్సోలినీగారి పెత్తనము వారిచే నిరూపింపబడిన నూతన రాజ్యాంగ విధానము ఫార్లమెంటుయొక్క సాధారణశాసనములద్వారా యేర్పరుప బడినవి.

"పెళుసుదనము" గానుండు రాజ్యాంగ విధానములగురించి క్లుప్తముగా విచారింతము. ఇట్టి రాజ్యాంగవిధానముల మార్చుటకు ఈక్రింద పేర్కొనబడిన నాల్గుపద్ధతులలో, ఏ