పుట:Adhunikarajyanga025633mbp.pdf/53

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రమందంగీకరీంపబడిన మూడుచట్టములు ఆరాజ్యాంగవిధానమునకు ప్రాతిపదికలని మాత్రము చెప్పవచ్చును. పిమ్మట, అవసరముబట్టి యేర్పడిన సవరణలుకూడా జేర్చబడుచో రాజ్యాంగవిధాన మిదమిద్ధమని చెప్ప సాహసింపవచ్చునేమో కాని, రాజ్యాంగవిధానపు చట్టమియ్యదియను నిర్ణయముమాత్రము సాధ్యముకాదు.

ప్రసిద్ధిబొందిన స్విట్జర్లాండునకు క్రీ. శ. 1815 నందు చట్టమొకటి సృష్టించబడినది. ఇటలీదేశమునకు 1848 లోను, జర్మనీసామ్రాజ్యమునకు 1871 యందు, యుద్ధానంతరము బాల్కనురాష్ట్రములకు జర్మనీదేశమునకు రాజ్యాంగవిధానపు చట్టములు ప్రసాదించబడెను. జపానుకు 1890 నందు, చైనాకు 191- నందు చట్టములు సవరించబడెను. మన దేశమునకు 1908 లో నొక్కటి, 1919 లో మరొక్కటిరాజ్యాంగ విధానపుచట్టము లేర్పరుపబడెను. త్వరలో మరొక్కటిరానై యున్నది.

అవసరము కల్గునప్పుడెల్ల కాలగతిననుసరించి ప్రజాభిప్రాయమున కనుకూలముగా నీచట్టమును సవరణజేయు టగత్యము. కానిచో, ఎప్పుడో ప్రజాప్రతినిధులెల్లరుజేరి తమదేశమునకు తమకాలావసరములబట్టి యెట్టి రాజ్యాంగ విధానము అవసరముగా, లాభకరముగా నుండునో అద్దానిని నిర్ణయించుకొనుచో కాలావసరములుమారి ప్రజల ఆచార