పుట:Adhunikarajyanga025633mbp.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ్యాంగవిధానపు చట్టమేమియు లేకుండా మరియేయితర ప్రాముఖ్యమగు దేశము కాని, ప్రజాస్వామిక రాజ్యాంగము పొందినది కానరాదు.

రాజ్యాంగ విధానపుచట్టము, ఆధునిక యుగమందు ప్రప్రథమమున, ప్రపంచదృష్టి నాకర్షించురీతి క్రీ. శ. 1781 నందు, అమెరికాయందేర్పఱచబడినది. ఆచట్టముప్రకారము, ఇంగ్లీషువారి రాజ్యాధికారమునుండి విడివడి, తమస్వతంత్రత నిల్పుకొనుటకై అమెరికారాష్ట్రములు, తాత్కాలిక సమ్మేళన మేర్పరచుకొనుచూ, చట్టము నంగీకరించినవి. తుదకు తమస్వతంత్రత నిలబెట్టుకొని ఇంగ్లీషువారి నోడించినపిమ్మట ఇప్పటికిని అమలునందున్న రాజ్యాంగవిధానమ్ము చట్టమును క్రీ. శ. 1789 వ సంవత్సరమున "నేషనల్ -------" వారంగీకరించి అమలునందు బెట్టిరి. అంతకుముందే వివిధరాష్ట్రములందు ఇట్టిచట్టములు అమలునందున్నమాట నిజమేకాని పిమ్మట, ఫ్రాన్సుదేశమందు విప్లవము జరిగినతరువాత రాజ్యవిధానపుచట్టమొక్కటి నిర్మింపబడెను. విప్లవరాజ్యానంతరము పదునెనిమిదవ లూయీప్రభువుగారొక చట్టమును క్రీ. శ. 1814 నందును, శ్రీలూయీఫిలిప్పుగారొక చట్టమును క్రీ. శ. 1830 యందును నిర్మించిరి. కాని, యిప్పటికిమలునందున్న ఫ్రెంచివారి రాజ్యాంగ విధానము నిర్ణయించుట కే యొక్కచట్టమునుప్రత్యేకముగ లేదు. క్రీ. శ. 1874 వ సంవత్స