పుట:Adhunikarajyanga025633mbp.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లందును ఋషిప్రోక్తములగు ధర్మసూత్రసముదాయమే రాజ్యాంగవిధానముగా యుపయోగపడుచుండెను.

ఇదే విధముగా ఇంగ్లండునందును రాజ్యాంగవిధానపు చట్టమనునది యొకటి లేదు. క్రీ. శ. 1215 వ సంవత్సరము నందేర్పడిన రాజకీయ యొడంబడిక "Magna Charta" ప్రకారము కొన్నిలక్షణములు క్రీ. శ. 1589 వ సంవత్సరమున అంగీకరింపబడిన "ప్రజాస్వత్వముల" చట్టముప్రకారము మరికొన్ని లక్షణములు క్రీ. శ. 1832, 1867, 1872, 1885, 1914, 1918, 1928 సంవత్సరములం దేర్పఱచబడిన శాసనములద్వారా మరికొన్ని లక్షణములు నిరూపింపబడినవి. కాని వీనియన్నిటి జేర్చినను ఇప్పుడమలునందున్న ఇంగ్లాండుయొక్క రాజ్యాంగవిధానపు సంపూర్ణస్వరూపము కానరాదు. ఎన్నో యాచారములవలన, ఎన్నో న్యాయమూర్తులతీర్పులమూలమున, ఎన్నో పార్లమెంటుశాసనములద్వారా వివిధగతుల కొంచెము, కొంచెముగా ఇంగ్లీషువారి రాజ్యాంగవిధానము తన రూపును బహిర్గత మొనర్చుచున్నది. చారిత్రక కారణముల వలన, ఇంగ్లీషుప్రజల ప్రత్యేకావసరముల ననుసరించి మరితర బాధ్యతాయుతరాజ్యాంగవిధానముల యనుభవము బొందుటకు సాధ్యముకాని దినములందు వారి రాజ్యాంగ విధానము పెరుగవలసివచ్చెను. కనుక దానిని యిదమిద్ధమని తేల్చి చూపెట్టుటకు చట్టమొకటి నిర్మింపబడదాయెను.