పుట:Adhunikarajyanga025633mbp.pdf/54

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వ్యవహారములు, జీవితవిధానము మార్పుజెందినపిమ్మట ఆచట్టము నిరుపయోగమగుటయే కాక, బాధాకరమై అభివృద్ధినాపి జాతినినాశనకరము గావచ్చును. ఋషిప్రోక్తములగు ధర్మసూత్రములు అతిపవిత్రమైవని మన పూర్వులేకాక గ్రీసు, రోమనుదేశస్థులును నమ్మియుండిరి. కాని మనదేశమందు వానిని మార్చుట దుస్తరమగుచుండెను. గ్రీసునందు రాజ్యాంగవిధానపు చట్టమునందు మార్పులు జేయవలెనని సూచించు నాయకులు ప్రజలచే రాజ్యాంగవిద్రోహులని ధూషించబడుటకుకూడ తయారైననే సవరణల ప్రతిపాదించి పౌరసభవారిచే ఆమోదింపజేయుటకు సాధ్యమగుచుండెను. ఇందువలన సనాతన భారతదేశపు రాజ్యాంగవిధానము కాల పరిణామముల ననుసరించి తగురీతి మార్పు బొందకుండుట వలన తుదకు మనప్రజలు దానిమఱచి తమకుతోచినరీతి రాజ్యము సాగించుకొనజొచ్చిరి. రోమనురాజ్యమందును, గ్రీసు యొక్క నగరరాజ్యములందును ఒకప్పుడు కాకపోయిన మరొకప్పుడైన సవరణలు చేయుటకు సాధ్యమగుచుండెను.

కాన రాజ్యాంగవిధానపు చట్టముల నేర్పరచుచో వానిని సవరించుట దుస్సాధ్యమేమోయని కొందరు సందేహించిరిగాని, అట్టిసందేహమునకు తావులేదని ఈ కాలపు రాజ్యాంగపు చట్టముల జూచినవారికి తెలియగలదు. రాజ్యాంగవిధానమును నిరూపించుటకొక చట్టము లేకున్ననే ఆవిధాన