పుట:Adhunikarajyanga025633mbp.pdf/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కాశము అవసరము. అవసరములననుసరించి శాసనములనిర్మించుశక్తి, ప్రజలకు సరాసరిగాగాని, తమప్రతినిధులద్వారాకాని కల్గించవలెను. ప్రజలయిష్టముననుసరించియే మంత్రాంగ వర్గమేర్పడుటకు, రాజ్యాంగవిధానము అవకాశముకల్గింపవలెను. "రాజ్యాంగవిధానముమాది, రాజ్యాంగపుసంస్థలుమావి, రాజ్యాధికారము మాకున్నది, రాజ్యముజేయుటకు మాకర్హత కలదు, రాజ్యమునుమేము నడుపుచున్నాము" అను అభిమానము ప్రజలకుకల్గిననే ప్రజాస్వామిక రాజ్యము జయప్రదమై, సుస్థిరమై శోభాయమానమగును. అట్టి సదుపాయములుకల్గు వరకు ప్రజాస్వామికము పూర్తిగా యేర్పడలేదనే చెప్పవలెను. ఇంకను ప్రపంచము ప్రజాస్వామికమునకు అర్హతపొందుచునేయున్నది. ఇప్పటికింకను యేదేశమందును, ప్రజాస్వామికము సంపూర్తిగా, సంతృప్తిగా యేర్పడుటకు సదుపాయములు కల్గుటలేదు. ఇట్లనుటవలన ప్రజాస్వామికము ఈకాలపు ప్రజలకు అతీతమై అందరానిదై యుండును కనుక, ఉపయోగరహితమనరాదు. మరి యేయితరప్రభుత్వ విధానమువలననైనను ఇప్పటికి సాధ్యమగు ప్రజాస్వామికముకంటె తక్కువలాభము, హెచ్చునష్టము కల్గునని ప్రపంచానుభవము ఋజువుచేయుచున్నది. మరి యేయితర రాజ్యాంగపద్ధతియు, ఈకాలపు ప్రజలకు ఆధునికపరిస్థితులందు ప్రజాస్వామిక రాజ్యాంగవిధానమువలె సంతృప్తిగల్గించజాలదు. కాని, పూర్ణముగా