పుట:Adhunikarajyanga025633mbp.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రజలు ప్రజాస్వామిక రాజ్యాంగమువలన లాభమును పొందవలయునన్న, ఇప్పుడు అచ్చటచ్చట కల్గుచుండు దురవస్థల నుండి విడివడవలయునన్న, పైన పేర్కొనబడిన సావకాశములు కలుగ జేయవలసియున్నది. ఎట్టి పరిస్థితులందు ఈవిధానము సంపూర్ణసంతృప్తికల్గించునో వానిని సృజించుటకు తగు జాగ్రత్తపడక "అదుగో, అచ్చట ప్రజాస్వామికము విచ్ఛినమైనది. ఇదుగో, యిచ్చట నయ్యది అదృశ్యమైన" దన్న అజ్ఞాన సూచకముగాదా?




________________