పుట:Adhunikarajyanga025633mbp.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముగా నుండునట్లేర్పరచబడవలెను. దానియొక్కవివిధభాగములు, ప్రజలనీతిపరులుగాజేయుట కుపయోగపడవలెను. ప్రజాసామాన్యపు శక్తియుక్తులననుసరించియే మంత్రుల బ్రజాప్రతినిధుల బాధ్యతాయుతులై యుంచుటకు తగుయవకాశములను రాజ్యాంగవిధానము కల్పించవలెను. ప్రజల కెక్కుడుశ్రమ కల్పించకయే, వారి యధికారము తగు ఋజుమార్గములద్వారా ప్రవహింపజేసి రాజ్యాంగమునంతను సక్రమ పద్ధతుల ననుసరించి నడపుసావకాశముల నయ్యదిసృష్టించవలెను. స్థాపితమగు వివిధరాజ్యాంగసంస్థలు, అమెరికాయందువలె, పరస్పరస్వయం నిర్ణయముజెందక, ఇంగ్లాండునందువలె, పరస్పరసహకారపరంపరంబొంది, ప్రజాభ్యుదయమే తమపరమావధిగా పరిగణించవలెను. ఎన్నికలయందు ప్రజలుతమకు వలయు అభ్యర్థుల సులభముగా తేల్చుకొను యవకాశము కల్గించి, శాసనసభలయొక్క సమావేశములద్వారా, ప్రజలకు రాజ్యాంగపు నిజస్థితిగతులు తెలియు సావకాశముకలుగ జేసి, ప్రజాభిప్రాయము మంత్రులకు సరాసరిజేర్చుటకు సదుపాయములకల్గించి, ప్రజలయొక్క ఆధిపత్యత ప్రతిరాజ్యాంగ సంస్థపై తాండవమాడునట్లు జేయు రాజ్యాంగ విధాన మగత్యము.

చీటికిమాటికిగాక, అగత్యమైనప్పుడెల్ల ప్రజాభిప్రాయముననుసరించి, రాజ్యాంగవిధానమును మార్పుజేయుటకవ