పుట:Adhunikarajyanga025633mbp.pdf/335

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బాధ్యతాయుతమంత్రివర్గము స్థిరపడియున్నంతకాలము అయ్యది "ప్రజాప్రతినిధిసభ" వారికె బాధ్యతచెందియుండుట తప్పదు. కాని యిప్పుడెటుల సభయొక్క సభ్యులు కొందరు మంత్రివర్గమందుందురో, అటులనే వస్తునిర్మాతకుల సభయొక్క సభ్యులు కొందరు మంత్రివర్గమందు జేర్చుకొనబడుచుండవలెను. అప్పుడే మంత్రివర్గమునకు ఈసభ వారి తత్వము త్వరితముగా బోధపడుటయు, వారి శాసననిర్మాణకార్యక్రమము నెడ ఈసభవారు సుముఖతజూపుటయు సాధ్యమగును. అట్టియెడ శాసననిర్మాణకార్యమందు "వస్తునిర్మాతకుల శాసనసభ" వారు ప్రతిపాదించు బిల్లులను మంత్రివర్గమువా రంగీకరింపజాలనిచో వానిని ప్రజాప్రతినిధి సభ వారిచే నిరాకరింపజేయవచ్చును. కాని "రిఫరెండము" నం దాబిల్లులు ప్రజలచే నామోదింపబడినయెడల, మంత్రివర్గము రాజీనామా యివ్వవలసివచ్చును. ఇందువలన వృత్తుల యవసరముబట్టి అవసరమగునప్పుడెల్ల ప్రజాభిప్రాయమునెడ భయభక్తులుకల్గిన మంత్రివర్గమువారు శాసననిర్మాణమును జేయించుచుండుట సాధ్యమగును.

ధనికులు, యజమానులగువా రదృశ్యులై, వృత్తులన్నియు, కార్మికుల సంఘములద్వారా, ప్రభుత్వము వలన నడుపబడు చుండుదినములం దెట్టిశాసనసభ లగత్యమో, "ఆధునిక రాజ్యాంగతత్వము" అను గ్రంథమందు వివరింతు