పుట:Adhunikarajyanga025633mbp.pdf/336

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ము. ఇప్పటి శాసనసభలు, ఆర్ధికజీవితముయెడ తగినంత శ్రద్ధ జూపుట లేదనియు, కార్మికుల యవసరముల గమనించుట లేదనియు, అందువలన ప్రజాసామాన్యమునకు, వానియెడ తీవ్రమగు అసంతృప్తి కల్గుచున్నదనియు మన మిచ్చట గమనించవలెను. ఇప్పుడున్న "సెనెటుసభలకు బదులు, వస్తునిర్మాణకుల శాసనసభ"ల నేర్పరచుట ప్రజోపయోగకరము. శాసననిర్మాణము చురుకుగా జరుగుటకై "వస్తునిర్మాణకుల శాసనసభ"కు "రిఫరెండము"ను తోడుజేయుట శ్రేయస్కరము.

ఇట్టి "వస్తునిర్మాణకులసభ"కు మాతృక ఈకాలమందు జర్మనీరాజ్యాంగమందలి "ఆర్థిక శాసనసభ" యందు జూడనగును. ఆసభయందు వివిధజిల్లారాష్ట్రీయ కార్మికసంఘములు "యజమానుల" సంఘముల ప్రతినిధులు కలరు. వివిధ వృత్తులకు వానివాని ప్రాధాన్యతల ననుసరించి తగురీతి ప్రాతినిధ్యత యొసంగబడుచున్నది. ప్రముఖులగు కార్మిక నాయకులు, యజమానులుకూడ ప్రత్యేకముగా సభ్యులుగా నియమింపబడుటకలదు.

ఈసభ వారు ఆర్ధికజీవితమునకు సంబంధించినంతవరకు ఏబిల్లునైనను తయారుచేసి చర్చించి అంగీకరించనగును. అంత నాబిల్లును మంత్రివర్గమువారు పరిశీలించి తమ యభిప్రాయ