పుట:Adhunikarajyanga025633mbp.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్షేమములగూర్చి కన్పరచు శ్రద్ధ, ఓపిక, ఆతురత, ఇప్పటి శాసనసభలయందు ప్రకటింపబడుట లేదు. మరియు యిప్పటి శాసనసభలందు కదాచితుగ మాత్రము కార్మికులకు యజమానులతోబాటు సమానమగు ప్రాతినిధ్యము సంపాదితమగు చుండ "వస్తునిర్మాతకుల శాసనసభ"యందు ప్రధమమునుండి శాశ్వతముగా యజమానులతో సమానముగా కార్మికులును ప్రాతినిధ్యత పొదగల్గుదురు.

"భోక్తల శాసనసభ" వాస్తవముగా ఇప్పటిశాసనసభలవలెనే యుండును. ఇప్పటికాలసభలును, భోక్తల యొక్క అవసరముల గురించియు, పౌరుల కోర్కెలగురించియు, శ్రద్ధజేయుచున్నవి. ఐతే ఇప్పటి శాసనసభలందు ప్రజాప్రతినిధిసభలే ప్రాముఖ్యత బొందియున్నవి. ప్రజాప్రతినిధిసభలో పౌరులెల్లరి ప్రతినిధులు కలరు. వివిధనియోజకవర్గముల నుండి ఈసభయొక్క ప్రతినిధు లన్ను కొనబడుచున్నారు. అటులనే "భోక్తల శాసనసభ"యు నిర్మింపబడును, కనుక సాంఘికవాదుల తత్వముప్రకారము ఇప్పటి ప్రజాప్రతినిధిసభ లట్లే యుండవచ్చును. సెనెటుసభలమాత్రము నిర్మూలించి వారిస్థానే "వస్తునిర్మాతల శాసనసభ"ను స్థాపించవలెను.

ఐతె బడ్జెట్టు తయారుచేయుటలో ఈరెండు శాసనసభల కెట్లెట్టిబాధ్యత లుండవలయును? వృత్తులందలి ప్రజలే గదా శిస్తులచెల్లింపవలసినది. వివిధవృత్తులందలి కార్మికు