పుట:Adhunikarajyanga025633mbp.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లెంతగా శిస్తుభారము మోయవలెనో, యజమానులెంత భరించవలెనో తీర్మానించుటకు "వస్తునిర్మాతకుల శాసనసభ" కు హెచ్చుశక్తి యుండును. కాన వారు "ప్రజాప్రతినిధిసభ వారితో బడ్జెట్టు తయారుచేయుటలో" పోటీపడజొచ్చెను, "ప్రజాప్రతినిధిసభ వారు" ప్రజావసరములకై ధనమునుకోరుచుందురు. కనుక ఒకరు శిస్తులనిచ్చువారు, మరొకరు ఖర్చిడువారునై యుందురు. బడ్జెట్టును నిర్మించుటలో యీవిధమగు ద్వంద్వపెత్తనముండుట శ్రేయస్కరముగాదని ప్రపంచపుటనుభవము తెల్పుచున్నది. మరియు శిస్తులనివ్వకల్గు సభయే ప్రభుత్వపుధనమును ఖర్చుపెట్టు అధికారమును కోరుచుండును. కాని ప్రజలందరి యవసరముల గమనించుచు, అన్ని వృత్తులయందును సమానభావము కల్గియుండి దేశమందు శాంతి నెలకొల్పి, ఉద్యోగులు, నిరుద్యోగులు, వృద్ధులు ఎల్లరికి ప్రతినిధియై బాల బాలికలు తదితరుల క్షేమమునకై కృషిచేయవలసిన బాధ్యతకల్గిన "ప్రజాప్రతినిధిసభ"కె బడ్జెట్టును తయారుచేయు అధికారము నొసంగుట యుత్తమము. "వస్తునిర్మాతకుల సభ"వారు వివిధవృత్తులమధ్య శిస్తుభార, మెటుల పంచి యిడనగునో నిర్ణయింపజాలరు. ప్రభుత్వాదాయమును కూడ వృత్తులవారీగాగాక ప్రజావసరములబట్టి ఖర్చిడవలసియున్నది. కనుక "ప్రజాప్రతినిధి సభ" వారికే బడ్జెట్టును నిర్మించు ప్రధానాధికారమిచ్చుట లాభకరము.