పుట:Adhunikarajyanga025633mbp.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆశించుచుందురు. యుద్ధమువలన ఆర్ధికజీవితము తారుమారై ప్రజలు కష్టముల పాలగుదురని యీసభవారు త్వరితముగా గమనించకలరు. యజమానులే యిప్పటి సభలందు హెచ్చుప్రాముఖ్యత పొందుచుండుటవలన ఆర్ధికసంక్షోభములు కల్గుటతు, యుద్ధములు సంప్రప్తమగుటయు జరుగుచున్నది. ఈసభవారు ఆర్ధికసామరస్యమును, వర్తకవ్యాపార విజృంభణమును, నానాజాతిసౌభ్రాతృత్వమును హెచ్చుగా కోరుచుందురు. కనుక శిస్తులభారము తగ్గి వ్యాపారము హెచ్చగుటకు వీరు తోడ్పడుదురు.

ఈకార్యము లన్నిటిని సాధారణశాసనసభ నిర్వర్తింపకలదు. ఇప్పటికే వీనిలో ననేకములను చాలవరకు జరుపుచునే యున్నది. ఆస్ట్రేలియాదేశపు శాసనసభలు కార్మికులకు చాలవరకు సంతృప్తికల్గించుచున్నవి. ఇంగ్లాండునందు యజమానులు కార్మికులమధ్య కల్గుచుండు సంఘర్షణల తగ్గింప పార్లమెంటు చాలా ప్రయత్నముల జేయుచున్నది. కనుక పౌరులెల్లరు మేల్కొని తమవోటులను సక్రమముగ ప్రజాసామాన్యపు మేలుకోరువారికే యిచ్చుచో పైన పేర్కొనబడిన "వస్తునిర్మాతకుల శాసనసభ" వారిధర్మముల నన్నిటి నెరవేర్చకలదు. కాని అనుభవమందు ప్రజలు తమ మేలునే కోరు లేబరుపార్టీని బలపరచుస్థితియందు లేరు గనుక "వస్తునిర్మాతకుల శాసనసభ"యందు కార్మికుల యోగ