పుట:Adhunikarajyanga025633mbp.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్యోగులైనవారి కెంతజీవనభృతి చెల్లింప నగునో, అవిటివారైన కార్మికుల కెట్లు నష్టపరిహారము చెల్లింపవలెనో శాసననిర్మాణము చేయదగును. వివిధవృత్తులందలి కార్మికులు, యజమానులమధ్య లాభముల నెట్లుపంచియిడనగునో, ఆయావృత్తుల నడపుటలో యిరుపక్షములవారి కెంతెంత పెత్తనము కలుగవలెనో ఈసభవారు నిర్ణయించనగును. ఈసభయొక్క చర్యలద్వారా కర్మాగారాధిపతులకు, కార్మికులకు, దేశమందలి వర్తక వాణిజ్య వ్యవహారము లన్నియు ఎట్లెట్లు జరుపబడుచున్నవో, ఏయేవిధముల ఏయేవృత్తులందు జాతీయైశ్వర్యము వృద్ధిబొందుట కాని క్షీణతజెందుట కాని జూడనగునో, విదేశములయొక్క ఆర్ధికజీవితమునకు తమ దేశీయుల ఆర్ధికవ్యవహారముల కెట్టిభేదములు కలవో? దేశమంతకు లాభకరమగునట్లు వివిధవృత్తులమధ్య తగుపోటి సహకార మేర్పరచి, ఆర్ధికజీవితము కళాప్రపూర్ణముగా నొనర్చుటకు సాధ్యమగును. ఇప్పటివలె యుద్ధములందు దిరుగుటకుగాని, ఎగుమతి దిగుమతి పన్నుల వేయుచు విదేశములతో ఆర్ధిక సంఘర్షణ కల్గించుటకు కాని ఆసభ యేర్పడిన పిమ్మట అంతసుళువుగా సాధ్యముకాదు. ఇప్పటి శాసనసభలకంటె "వస్తునిర్మాతకుల శాసనసభ" వారు ఆర్ధికవ్యవహారములకె హెచ్చుప్రాముఖ్యత నిచ్చి ఎగుమతి దిగుమతులు ప్రపంచమందంతట ఏయడ్డంకులు లేకుండ జరుగవలయునని