పుట:Adhunikarajyanga025633mbp.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తప్రాముఖ్యతబొందియున్నను ఇప్పు డతిక్షీణదశ యందుండవచ్చును. వెనుక దీనావస్థయందున్నవృత్తి యిప్పుడు వృద్ధి యందుండనోపును. ఇటుల కాలానుగుణముగా కల్గుచుండు మార్పులననుసరించి వివిధవృత్తుల కొసంగబడు ప్రాతినిధ్యము మారుచుండవలయునుగదా? ఆయావృత్తులందలి కార్మికులు వారిప్రతినిధుల నెన్నుకొనవలెనా? లేక వారిసంఘము లెన్నుకొనునా? ఒకవృత్తికిహెచ్చు, మరొకవృత్తికితక్కువ ప్రాతినిధ్యము చే కూరినదని వివాదములు కల్గుచుండును. ఇన్ని యిబ్బందులున్నను అనుభవమున "వస్తునిర్మాతకుల శాసనసభను" నిర్మించుట దుస్తరముకాదని జర్మనీయందలి ఆర్ధిక శాసనసభావృత్తాంతము, ఇటలీయందలి ఫాసిస్టుపార్టీవారి యేర్పాటులు, రషియాయందలి "సిండికేటుల నిర్మాణము" తెల్పు చున్నవి.

"వస్తునిర్మాతకుల శాసనసభ" ఎటులనైన నేమి యేర్పడినదనుకొందము. ఈసభవారు నిర్వర్తించవలసిన కార్యవిధానమెద్ది? వివిధవృత్తులందు యజమానులు కార్మికుల మధ్య కల్గువివాదము లెట్లు పరిష్కరింపబడునో తీర్మానింతురు. యజమానులు తమకర్మాగారముల నెట్లుసృజింపవలెనో, కార్మికుల కపాయము కల్గకుండుటకై యేలాటి యేర్పాటులు చెయనగునో వివిధతరగతులకు జెందిన కార్మికులకు ఎట్లెట్లు ఎంతెంత కూలి నాలి చెల్లింపవలెనో, నిరు