పుట:Adhunikarajyanga025633mbp.pdf/297

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ చర్యయందు సమగ్రముగా విచారించి, తదితరవివాదముల చర్చించుటకు ఆబిల్లులను స్థాయిసంఘములకుగాని, ప్రత్యేక సంఘములకుగాని పంపించవచ్చును. ఆసంఘములందు సభవారి వివిధరాజకీయకక్షీలు వారివారి బలముననుసరించి ప్రాతినిధ్యత నొందవచ్చును. అట్టిసంఘములందు సభ్యత్వముబొందిన వారెల్లరు, ఆయాబిల్లుల సమగ్రముగా చర్చించి తగు మార్పులసూచించి తిరిగి వానిని సభవారికి నివేదించవచ్చును. ఆసంఘపు చర్చలందుకూడ అధికసంఖ్యాకులకు జెందిన మంత్రివర్గమువారు తమకంగీకృతమగు సవరణలనే జేర్చునట్లు జాగ్రత్తపడును. తిరిగి సభవారు మూడవమారు స్థాయిసంఘములచే సవరింపబడిన బిల్లులచర్చించి, తమకంగీకృతమగుచో శాసనములుగా నిర్మించనగును. ఇటుల మంత్రివర్గమువారి పెత్తనముక్రిందనే, శాసననిర్మాణముజేయుటలో సభ్యులు హెచ్చుగా సహకార మొనర్చుటకు వీలుకలదు.

ఫ్రాన్సునం దిట్లు మంత్రివర్గమువారి పెత్తనము సాగుటలేదు. మంత్రివర్గమువారి బిల్లును స్థాయిసంఘమువారు తమ యిష్టమువచ్చినట్లు మార్పు జెందించి, తుదకు మంత్రివర్గము వారికే యిష్టము లేనిరీతి చేయవచ్చును. "మెజారిటీ" నెట్లో రాచకీయ బృందములసమ్మేళన ద్వారా సభయందు బొందినను స్థాయిసంఘమందలి బృందములు స్వతంత్రించి ప్రవర్తించును గనుక, మంత్రివర్గమువారికి తమ కిష్టమగురీతినే శాసననిర్మా