పుట:Adhunikarajyanga025633mbp.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రజాప్రతినిధిసభవారికి శాసననిర్మాణ కార్యమునకు తగినంత వ్యవధియుండదు. బాధ్యతాయుతమంత్రివర్గమున్న రాజ్యములందు, శాసననిర్మాణము మంత్రాంగముయొక్క ప్రధానధర్మములలో నొక్కటైయున్నది. కనుక, మంత్రాంగ సభవారిచే ప్రతిపాదింపబడు బిల్లుల చర్చించుటకు, సభవారు ముందు వ్యవధికల్గించు టవసరము. ఆబిల్లులను చర్చించునప్పుడును, ప్రతిపక్షులు ప్రతిష్టంభనము నవలంబించి, ఎప్పటికి పూర్తిగాని చర్యలజేయుచు, బిల్లులయభివృద్ధి నాపకుండుటకై ప్రతిబిల్లును ఎన్నిదినములలో చర్చింపబడవలయునో, ఏయే భాగము లేయే గడవులలోపల వోటునకు పెట్టబడవలెనో నిర్ణయించు యధికారము మంత్రివర్గమునకు సభ్యులిచ్చుటయే యుత్తమము. అప్పుడే కొన్ని బిల్లులైనను, ప్రతికక్షి వారి విమర్శనలకు మించి, శాసనరూపము దాల్చగలవు. ఇట్లు మంత్రివర్గము వారిచే నియమింపబడిన వ్యవధియందె, సభ్యలాయాబిల్లుల చర్చించుటకు బ్రయత్నించవలయును.

కాని, ఈ పద్ధతివలన సభయందే బిల్లులనన్నిటి సమగ్రమముగా చర్చించుటకు తగుయవకాశము కలుగనిమాట నిజము. శాసననిర్మాణమున కెంత కుతూహలత సభ్యులు పడుదురో, అంతయాతురత వానిని సక్రమముగా సవ్యముగా నిర్మించుటలోను జూపెట్టవలసియున్నది. కనుక బిల్లులందంతర్గతమైయున్న ప్రధానసూత్రములమాత్రము సభవారు రెండ