పుట:Adhunikarajyanga025633mbp.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ణము చేయించుకొనుశక్తి కల్గుట లేదు. ఇటులనే అమెరికా యందును ప్రెసిడెంటుగారు కోరినట్లుగాక కాంగ్రెసువారు అనేక మారులు స్వతంత్రించి శాసనముల జేయుట కలదు. ఈపద్ధతి యెంతయు అనర్ధ దాయకము.

బడ్జెట్టును తయారుచేయుటకు సంపూర్ణ స్వాతంత్ర్యము మంత్రివర్గమునకే యుండుట మేలు. ధనము సంపాదించవలసిన బాధ్యత మంత్రివర్గముపై యుండుటచే ఏయే కార్యములకై ఎంతెంతధనము ఖర్చిడవలెనో తీర్మానించుయధికారము మంత్రివర్గమునకు చెందవలెను. అటులగాక, ప్రతిసభ్యుడును తనకుతోచిన కార్యమునకై, తననియోజకవర్గమునకు లాభము కల్గించు వ్యవహారమునకై ప్రజలందరిధనమగు ప్రభుత్వపుటాదాయమును ఖర్చిడుట కుత్సాహపడుచుండును. ప్రతిసభ్యుడిట్లేచేయుచో ప్రభుత్వపుఖర్చులు మితిమించిపోవుటయు, ఆదాయము చాలకపోవుటయు, తుదకు దివాలా కల్గుటయు తధ్యము. అట్టిదుస్థితి కలుగకుండుటకై శాసనసభా సభ్యులకు వ్యక్తిగతముగ ఖర్చుల నధికముగావించు ప్రతిపాదనలు జేయుశక్తి విరమించుటమేలు. అంత వివిధ డిపార్టుమెంటులపై మంత్రివర్గమువారు ఎంత ప్రభుత్వధనమును ఖర్చిడ తలపెట్టినారో ఆధనము నేయేశిస్తులద్వారా రాబట్టతలంచినారో తెలియ జేయుదురు. సభ్యుల కట్టియేర్పాటులు అసంతృప్తికల్గించుచో తగు యలజడిజేయనగును. ప్రభుత్వము తలపెట్టు ఖర్చులలో