పుట:Adhunikarajyanga025633mbp.pdf/294

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్రద్ధవహించువా రెక్కువగుటయు తధ్యము. మంత్రివర్గమున కట్టిబిల్లులలో ఎదియైన అంగీకృతమగుచో, అయ్యది ప్రభుత్వపుబిల్లుగా పరిగణింపబడవచ్చును. లేక మంత్రివర్గమున కట్టి బిల్లుపై అంతశ్రద్ధ లేకున్నను, విముఖత్వము లేనిచో, తానేమి యభ్యంతరపెట్టక, దానిని శాసనముగా సభవారిచే అంగీకరింప జేయవచ్చును. అటులగాక అట్టిబిల్లులపై తనకు వ్యతిరేకాభిప్రాయము కల్గుచో, మంత్రివర్గము దీనిని తీవ్రముగా నిరోధించి ఓడించవచ్చును. ఎటులైనను, శాసనసభవారి చర్యలు మాత్ర మట్టి బిల్లులను ప్రజలయందు ప్రచారమునకు దెచ్చును. ఆబిల్లుల సమర్థించు సభ్యులు ప్రాముఖ్యతకు వచ్చుటయు కద్దు.

పైనపేర్కొనబడిన అవకాశములే కాక, ప్రజాప్రతినిధిసభా సభ్యుడగు నాతడు (శాసనసభ్యుడనియే చెప్పబడును) మరికొన్ని

ప్రజాప్రతి
నిధిసభ.

యవకాశముల గల్గియున్నాడు. "అడ్జరన్‌మెంటు" తీర్మానమును ప్రతిపాదించి, మంత్రివర్గమునెడ సభవారికి విశ్వాసములేదని నిరూపించుటకు, సభ్యునకు అవకాశముకలదు. అట్టితీర్మానమును ప్రభుత్వము తీవ్రముగా నెదిరించి అయ్యది యంగీకరింపబడుచో, తాను రాజీనామానిత్తునని మంత్రివర్గపు ప్రతినిధి పల్కుచో, అప్పటికిని ఆతీర్మానము సభవారిచే నంగీకరింపబడుచో, మంత్రివర్గము పదభ్రష్టత జెందును. ఇటులనే