పుట:Adhunikarajyanga025633mbp.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మునుగురించి, ఒక తీర్మానమును ఏసభ్యుడైనను ప్రతిపాదించనగును. ఆతీర్మానమునందు కోరబడిన సంస్కరణమును ప్రభుత్వ కార్యక్రమమందు జేర్చవలెననికాని, శాసనరూపముగా పెట్టవలెననిగాని, మంత్రాంగవర్గమునకు సలహాల నివ్వవచ్చును. దీనిని సభ్యులెల్లరు, తమతమ పార్టీల ననుసరించిగాని, స్వతంత్రముగాగాని, చర్చించి ఇష్టమున్న అంగీకరింప వచ్చును. ఇట్టి తీర్మానముల చర్చించుటద్వారా, ఆయాసంస్కరణముల ప్రలయందు ప్రచారితమగునట్లు చేయుటసాధ్యము. ప్రభుత్వమునకు తానట్టి సంస్కరణము ప్రతిపాదింపకపూర్వమే, శాసనసభ వారి యభిప్రాయమును అట్టి తీర్మానములద్వారా తెలుసుకొనుటకు వీలగును.

సభ్యుల, తమపార్టీల ప్రోద్బలముచేగాని, తమవ్యక్తి స్వాతంత్ర్యముతోడనేగాని, బిల్లులను శాసనసభలందు ప్రవేశ పెట్టవచ్చును. శాసనసభకు కలవ్యవధియం దెవ్వరెవ్వరి బిల్లులు చర్చకువచ్చునో వానిపైతగుచర్య జరిపించి, తద్వారా దేశమందు తగుయలజడి ప్రచారము చేయింపవచ్చును. శాసనసభయం దేసంస్కరణకు సంబంధించిన బిల్లైనను ప్రవేశపెట్టబడుచో వార్తాపత్రికలు దానిని చర్చించును; ఆవిషయమునందు శ్రద్ధవహించు ప్రభుసంఘములు తగుయలజడి గావించును. ఇవ్విధముగా ప్రజలయందు తగినంతచర్య ఆ సంస్కరణపై జరుగుటయు, అందువలన ఆసంస్కరణయెడ