పుట:Adhunikarajyanga025633mbp.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తప్ప మరియే యితర ప్రజాస్వామిక రాజ్యాంగమందును ప్రసాదించబడుట లేదు. బాధ్యతాయుతమగు మంత్రివర్గము ప్రజాభిప్రాయము ననుసరించియే నిర్మింపబడి తన కార్యనిర్వహణమొనర్చ వలయునన్న ప్రజలకే సరాసరి ప్రాతినిధ్యత వహించునట్టిసభవారిచే నిర్మింపబడవలయునని ఇంగ్లీషువారు ఇప్పటి కెప్పుడో కన్గొనిరి. వారి రాజ్యాంగవిధానపు పద్ధతులనే అవలంబించినతదితర రాజ్యములప్రజలును ప్రజాప్రతినిధిసభవారికే మంత్రాంగసభపై సంపూర్ణమగు ఆధిపత్యమునొసంగిరి. ప్రజలపై ఎట్టెట్లు ఏయేశిస్తులు ఎంతెంతవరకు వేయనగునో ప్రభుత్వధనము ఎట్లు ఏయే కార్యములకై ఖర్చిడనగునో నిర్ణయించు నధికారము ప్రజలపై యాధారపడియుండి ప్రజలకు సరాసరిబాధ్యులగు ప్రజాప్రతినిధిసభవారికే చెందియుండవలె నను సూత్రమునుకూడ బ్రిటిషువారినుండియే తదితరులు గ్రహించిరి. కనుక, ప్రజల కిష్టమగు మంత్రివర్గమును నిరాకరించుటకు అల్పసంఖ్యాకులకు జెందిన సెనేటుసభ వారి కధికారముకల్గుట న్యాయముకాదు. అటులనే ప్రజలందరియొక్క ధనమును అల్పసంఖ్యాకులగువారి ప్రతినిధులగు "సెనేటుసభవారు" ఏవిధముగ ఖర్చిడనగునో తీర్మానించుటయు సభ్యతకాదు. ఐతే ఈకాలపు ప్రజాస్వామిక రాజ్యాంగములందు ప్రభుత్వాదాయమం దెచ్చుభాగము అల్పసంఖ్యాకులగు ధనికులు, భూస్వాములు, కర్మాగారాధిపతులనుండియే రాబట్టుబడుచున్నది.