పుట:Adhunikarajyanga025633mbp.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాని, ఈ నార్వేవారి సెనేటుసభ పేరునకు గొప్పసభగా పరిగణింపబడుచున్నను వాస్తవముగా స్థాయిసంఘమువలెనే కార్యనిర్వహణ మొనర్చుచున్నది. సాధారణముగా స్థాయిసంఘసభ్యులు ప్రజాప్రతినిధిసభాసభ్యులై యుండి ఆసభ యెడ తమధర్మముల నిర్వర్తింపవలసి యుండుటవలన తగు వ్యవధికల్గియుండరు. కాన, బిల్లులను సంతృప్తికరముగా విచారింపజాలక పోవచ్చును. కాని వారు ప్రత్యేకముగా సెనేటు సభాసభ్యులైయుండి తమ వ్యవధినంతను మంత్రివర్గమును ఏర్పరచి దాని నదుపు నాజ్ఞలందుంచుటకు బదులు, శాసననిర్మాణమందే హెచ్చుజాగ్రత్త వహించుటచే శాసననిర్మాణమును చేయుటలో ప్రజాప్రతినిధిసభవారికి అపారమగు సహకారము చేసి రాజ్యాంగమున కమోఘమగుసేవ జేయగల్గుదురు. కనుకనే సెనేటుసభ యనునదియొక్కటి అవసరమని తలంచుచో ప్రజాప్రతినిధిసభవారితో సహకారమొనర్చుటకు సంసిద్ధపడునట్టి ఈ నార్వేవారి "లాంగ్ దింగ్" సభయే ఆదర్శప్రాయమైయున్నది.

శాసననిర్మాణమునందుతప్ప మంత్రివర్గము నేర్పరచుటయందు కాని, స్థానభ్రష్టతజేయుటలో కాని, బడ్జెట్టు

బడ్జెట్టు.

నంగీకరించుటలోను, ప్రజలపై శిస్తుల వేయుటలోను, ప్రజలధనమును ఖర్చిడుటలోను, సెనేటుసభవారి కేమాత్రము స్వతంత్రాధికారము ఒక్క అమెరికాదేశమందు