పుట:Adhunikarajyanga025633mbp.pdf/277

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గదా! అట్టి ప్రభుత్వాదాయమును రాబట్టుటలో సెనేటువారికి ప్రజాప్రతినిధిసభవారికంటె హెచ్చుజోక్యము, అధికారమివ్వబడుట సబబుకాదాయని కొందరు వాదించవచ్చును. కాని, సెనేటుసభయందు ప్రజలందరికి ప్రాతినిధ్యత లేకుండుటయు (ఆస్ట్రేలియా, అమెరికాయందుతప్ప) ప్రజాప్రతినిధిసభయందు ప్రజలెల్లరు ప్రాతినిధ్యతబొంది యుండుటవలన సెనెటువారికి శిస్తుల వేయుటకు ప్రభుత్వధనమును ఖర్చిడుటకు అధికారముండరాదు. మరియు ప్రభుత్వము ప్రజలందరిక్షేమాభివృద్ధికై యేర్పరచబడినది. శిస్తులను ఎవ్వరు చెల్లింపగలరో వారినుండి రాబట్టుట న్యాయము. ధనికులు, భూస్వాములు, కర్మాగారాధిపతులు ప్రభుత్వము సాగుచున్నంతకాలమే తమ ఆస్థుల భద్రముగా బొంది, తమ వ్యవహారముల సాగించుకొనగలరు. కనుక వారు తమ సంవత్సరాదాయమునుండి తమశక్తికొలది శిస్తుల చెల్లించవలయును. వాస్తవముగా ఈశతాబ్దారంభమువరకు ప్రతిదేశమందును (ఇప్పటికి, అనేక దేశములందు) బీదసాదలే ప్రభుత్వాదాయమం దెక్కువభాగము చెల్లించు చుండిరి. క్రమముగా ప్రజాసామాన్యపు పలుకుబడి వివిధరాజ్యాంగములందు హెచ్చుచున్నకొలది శిస్తులభారము ధనికులాదిగాగలవారిపై హెచ్చుగా మోపబడుచున్నది. శిస్తులభారము నిర్ణయించి, అద్దాని వివిధతరగతుల వారిమధ్య యెటుల పంచి యిడుట న్యాయమో విచారించుట కధికారము సెనెటు