పుట:Adhunikarajyanga025633mbp.pdf/273

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నిరాకరించినయెడల గవర్నరుజనరలు రెండుసభల సమ్మేళన సమావేశమును సమకూర్చవలెను. ఆ సమ్మేళనసభవారా బిల్లును సమగ్రముగా చర్చించి, దానిపై వోటు తీసుకొనవచ్చును. ఈ సమ్మేళనసభవారిచే నంగీకరింపబడినబిల్లును శాసనముగా గవర్నరుజనరలుగారు ప్రకటించవలెను. ప్రజాప్రతినిధిసభయందు 111 సభ్యులును, సెనెటుయందు 40 సభ్యులును కలరుగనుక, సమ్మేళనసభయందు ప్రజాప్రతినిధిసభలోని అధిక సంఖ్యాకులచే రెండుమారు లంగీకరింపబడిన బిల్లులు సాధారణముగా తిరిగి అంగీకరింపబడుట దుర్ఘటము కాదు. కనుక ప్రజాప్రతినిధిసభవా రిశాసననిర్మాణముపై పట్టుదలకల్గియుందురో ఆ కార్యమునందు వారు జయముబొందుట సుసాధ్యమగును.

నార్వేదేశపు సెనెటుసభ (లాంగ్ దింగ్, ప్రజాప్రతినిధిసభను ఒదెల్ దింగ్) యే హెచ్చు సంతృప్తికరముగా నిర్మింప బడినదని అనేక రాచకీయజ్ఞులు తలంచుచున్నారు. ప్రజాప్రతినిధిసభయందు నూటయేబది సభ్యులు కలరు. ఆసభవారే తమ ప్రధమ

నార్వే.

సమావేశమునందే తమలో నాల్గవవంతు మందిని సెనేటరులుగ ఎన్నుకొనవలెను. ఆనాల్గవవంతుమందిసభ్యు లప్పటినుండి ప్రజాప్రతినిధిసభయందు సభ్యత్వముమాని సెనేటుసభగా జేరుదురు. ప్రతిబిల్లును ముందుగా ఒదెల్ దింగ్ (ప్రజాప్రతినిధిసభ) యందు ప్రతిపాదింపబడి