పుట:Adhunikarajyanga025633mbp.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కేమాత్రము సందియ మొందరు. మరియు, వారికి తామును ప్రజాభిప్రాయమును ప్రకటించగలమను ఆత్మవిశ్వాసముగలదు. ఇట్టి పరిస్థితులం దీరెండుసభలమధ్య సంఘర్షణ తఱచుగా కల్గుటయం దాశ్చర్యమేమి?

దక్షిణాఫ్రికాదేశపు సెనెటునకు ఆదేశపు రాజ్యాంగ మంత ప్రాముఖ్యత నివ్వదలచినట్లు లేదు. ఎనిమిదిమంది సెనెటురులను

దక్షిణా
ఫ్రికా.

గవర్నరుజనరలుగారు మంత్రివర్గము వారి సలహాపై నియమించవలెను. ప్రతిసభ్య రాష్త్రమునకు, ఎనిమిదిమంది సభ్యుల నెన్ను కొను యధికారమొసంగబడెను. ప్రతిసభ్యుడును పదివత్సరముల వరకు సభ్యత్వము బొందియుండును. ఆతడు ముప్పదివత్సరములకు మించియుండవలెను. కొంతవరకు ఆస్తిపరుడై యుండవలెను. ప్రతిసభ్యరాష్ట్రమునందలి శాసనసభలు, ఒక చో సమావేశమై తమరాష్ట్రముతరపున, ఎనిమిదిమంది సెనెటు సభ్యుల నెన్నుకొనవలెను. నాల్గురాష్త్రములు కలవుగనుక సమ్మేళన సెనెటుసభయందు, నలుబది సభ్యులుందురు. ఈ సభవారు బడ్జెట్టుబిల్లులకు సవరణలు ప్రతిపాదించరాదు. ప్రజాప్రతినిధిసభవారు, అంగీకరించిన బిల్లును, ఈ సభ వా రంగీకరింపజాలనిచో, లేక, ప్రజాప్రతినిధిసభవారికి అసమ్మతికల్గించు సవరణల ప్రతిపాదించుచో, ఆబిల్లు తిరిగి ప్రజాప్రతినిధిసభవారిచే అంగీకరింపబడినను, సెనెటుసభవారద్దాని