పుట:Adhunikarajyanga025633mbp.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దానిచే అంగీకరింపబడినపిమ్మట లాంగ్ దింగ్ నకు పంపించబడును. 'లాంగ్ దింగ్‌' సభవా రాబిల్లును అంగీకరించినచో రాజు ఆబిల్లును శాసనముగా ప్రకటించవలెను. అటులకాక, "లాంగ్ దింగ్" వారు ఆబిల్లును నిరాకరించినగాని, సవరణజేసినగాని తిరిగి "ఒదెల్ దింగ్" వారు దానిని చర్చించవలెను. తమకు సవరింపబడిన బిల్లు సంతృప్తికరముగానిచో దానిని వదలివేయవచ్చును. లేదా తిరిగి తగుసవరణలతోగాని సంపూర్ణముగా వెనుకటి స్వరూపముననే ఆబిల్లును బలపరచి "లాంగ్ దింగ్" వారికి పంపించబడగా అప్పటికాసభవారద్దానిని నిరాకరింపుచో రెండు సభలసమ్మేళన సమావేశమునందు (స్టార్ దింగ్) ఆబిల్లు చర్చింపబడును. అంత నా"స్టార్ దింగు" నం దాబిల్లు పూర్తిగా చర్చింపబడినపిమ్మట మూడింట రెండు వంతులుసభ్యు లద్దాని నంగీకరించుచో రాజుగా రాబిల్లును శాసనముగా ప్రకటించవలెను. ఈ నా ర్వేపద్ధతివలన శాసన నిర్మాణము త్వరితగతి జరుగుటకును, ప్రతిబిల్లును సమగ్రముగా, సంతృప్తికరముగా చర్చింపబడుటకును, ప్రజాభిప్రాయము నెరింగి, దానియెడ సుముఖతజెంది దానిని ప్రకటించుట కుత్సాహులైయుండు ప్రతినిధులే రెండుసభలయందుండుటచే ప్రజాభిప్రాయానుసారము తగినంతత్వరితముగా బిల్లులు తయారుకాబడి శాసనములుగా ప్రకటింపబడుట సాధ్యమగుచున్నది.