పుట:Adhunikarajyanga025633mbp.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బిల్లును, సెనెటుసభవారిచే అంగీకరింపబడిననే, శాసనముగా ప్రెసిడెంటుగారిచే ప్రకటింపబడుట కర్హతబొందును. ఒకసభవా రొప్పుకొన్నను, మరొకసభవా రంగీకరించనిచో, ఆ బిల్లు, శాసనముగా నిర్మింపబడజాలదు. శాసననిర్మాణమమం దిట్లు సెనెటుసభవారికి ప్రజాప్రతినిధిసభవారితోబాటు సమానాధికారము లభించుటవలన శాసననిర్మాణము అమెరికాయందు, చాల మందగతిబొందుచున్నది. అసలే రాజ్యాంగవిధానపుచట్టము, కాంగ్రెసుయొక్క శాసననిర్మాణాధి కారమును సంకుచితపరచుచున్నది. దీనికితోడు, ఈ రెండుసభలకు, పరస్పరశాసననిర్మాణప్రయత్నములకు ప్రతిష్టంభనము చేయకల్గుహక్కుయున్నచో, శాసననిర్మాణము జరుగుట కష్టతమమగునుగదా!

ఆస్ట్రేలియాయందలి సమ్మేళనరాజ్యాంగమందు సెనెటుసభ కలదు. ప్రతిసభ్యరాష్ట్రమునకు ఆర్గురు సభ్యులు కలరు.

ఆస్ట్రేలియా.

వీరెల్లరు, రాష్ట్రమంతయు నొకే నియోజకవర్గము కాగా అందలి వోటరులందరిచే, ప్రపోర్షనల్ ప్రాతినిధ్యసూత్రనుసారము ఎన్నుకొనబడుచున్నారు. ప్రధమసెనెటుసభ్యులను రెండుతరగతులుగ విభజించి, ఒక్క తరగతివారు మూడువత్సరముల పిమ్మట, రెండవతరగతివారు ఆరువత్సరములపిమ్మట, తమస్థానముల ఖాళీచేయుటయు, ఆ స్థానములకు తిరిగి యెన్నికలుజరుగుటయు, అవసర