పుట:Adhunikarajyanga025633mbp.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభవారే తిరిగి తమబిల్లును సెనేటుసభవారిసలహాల ననుసరించి పునర్విమర్శన మొనర్చుట కంగీకరించి, బిల్లును కొంతవరకు మార్చుటకు పూనుకొననగును. ఈవ్యవధియందే మంత్రివర్గము మారుచో, సెనేటుసభవారి అభ్యంతరముల నన్నిటి బలపరచుటకుగూడ సాధ్యమగును. అవసరమైనచో, రెండుసభలును సమ్మేళనమై వివాదగ్రస్తమగు బిల్లును సమగ్రముగా చర్చింపవచ్చును. కాని దానిపై సమ్మేళనసభవారు వోటుచేయుటకూడదు. ఇవ్విధముగా బిల్లులు అంతఆలస్యమునకు గురి కాకుండనే శాసనములగుటకును ప్రతిబిల్లును అగత్యమైనచో, పునర్విమర్శనకు లోనగుటకు అవకాశము కల్పించబడినది. సెనేటుసభయే అగత్యమగుచో, శాసననిర్మాణము త్వరితగతి జరుగుటకు, ఈ రాజ్యాంగపు సెనెటుసభపద్ధతియే అత్యంత సుగమమని తోచుచున్నది.

అమెరికా సమ్మేళనరాజ్యాంగపు సెనెటుసభయందు, సభ్యరాష్ట్రములన్నిటికి ఒక్కొక్కరాష్త్రమునకు ఇద్దరు సభ్యులచొప్పున 96

అమెరికా.

మంది సభ్యులుకలరు. ప్రతిరాష్ట్రమునందును, ఒకే నియోజకవర్గము కలదు. రాష్త్రమందలి వోటరులెల్లరు, సెనెటుసభ్యుల నెన్నుకొనుటకు అర్హులు. సెనెటరులు, ఆరువత్సరములవరకు సభ్యత్వముబొంది యుందురు. రెండువత్సరముల కొకమారు, మూడవవంతువరకు, తిరిగి సభ్యులు యెన్నుకొనబడవలయును. ప్రతి