పుట:Adhunikarajyanga025633mbp.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వారు (డెయ్‌ల్ ఐరీసు) 'ప్రపోర్షనల్‌' పద్ధతిప్రకారము ఎన్నుకొన వలెను. ఈజాబితాలయందు సెనెటుసభయందు సభ్యులయి యుండువారు తిరిగి అభ్యర్థులుగా నుండగోరుచో, వారినామముల నుదహరింపవలయును. ఈజాబితాయందు వివిధమతసాంఘిక ఆర్థిక సంఘముల పెద్దల, రాజకీయవిజ్ఞానుల, అనుభవపరుల నామముల జేర్చవలసియున్నది. ఈవిధముగా ప్రజాప్రతినిధిసభవారి కంగీకారమగు పెద్దలే, అభ్యర్ధులుగా నియమింపబడుచున్నారు కనుక ప్రజలచే తుద కెన్నుకొనబడు సెనెటరులు ప్రజాప్రతినిధిసభకు వ్యతిరేకములుగాక, ప్రజాభీష్టములయెడ విముఖతజూపెట్టనివారై యుండవచ్చును. తుదకీసభవారైనను, ప్రజాప్రతినిధిసభవారివలె ప్రజేచ్ఛల నెరవేర్పతగు కుతూహలపడుట దుస్సాధ్యము కనుకను, శాసననిర్మాణము త్వరితగతి అడ్డంకులంతగ లేకుండగనే జరుగు టగత్యము కానను ఐరిషురాజ్యాంగచట్టము క్రొత్తపద్ధతుల నవలంబించుచున్నది. ప్రజాప్రతినిధిసభవారిచే నంగీకరింపబడిన బిల్లు సెనేటుసభవారిచే చర్చింపబడుటకై పంపబడినపిమ్మట 270 దినములలోగా, రెండుపక్షములకు సమ్మతమగునట్లు మార్పు జెందినను, లేక, అట్టిరాజీపద్ధతి సాధ్యపడకున్నను, రెండుసభలచే నంగీకరింపబడినట్లే పరిగణింపబడునను నియమము కలదు. ఈ తొమ్మిదిమాసముల వ్యవధియందు ప్రజాప్రతినిధి