పుట:Adhunikarajyanga025633mbp.pdf/270

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ము. అప్పటినుండి సెనెటుసభ్యులు, ఆరువత్సరములపాటు సభ్యత్వము బొందుదురు. కాని అమెరికా, ఐర్లండు, ఫ్రాన్సుదేశమలందువలె ఎల్లప్పుడు, సెనెటుసభ నిర్మితమైయుండునని చెప్పుటకు వీలు లేదు. గవర్నరుజనరలుగారు చట్టబద్ధమగు అవసరముకల్గునెడ, ఈసభనంతమొందించనగును.

ప్రజాప్రతినిధిసభవారిచే అంగీకరింపబడిన బిల్లును సెనెటుసభ వారు నిరాకరించుచో, లేక, అంగీకరింపనిచో, మూడుమాసములపిమ్మట, తిరిగి ఆబిల్లును, ప్రజాప్రతినిధిసభవా రంగీకరించుచో, అప్పటికిని సెనెటుసభవా రద్దాని నిరాకరించుచో, గవర్నరుజనరలుగారు, ఈ రెండుసభల నంతమొందించనగును. కాని ప్రజాప్రతినిధిసభవారు, సహజముగా అంతమొందువ్యవధి ఆరుమాసములకు తక్కువగా నున్నప్పుడుమాత్ర మాసభలను గవర్నరుజనరలుగారు అంత మొందించరాదు. నూతనముగా నిర్మింపబడుసభలు సమావేశ మొందినపిమ్మట, ప్రజాప్రతినిధిసభవారు వెనుకటి సెనెటుసభ వారిచే సూచింపబడిన సవరణల నంగీకరించిగాని, అంగీకరింపక యేగాని, తిరిగి యావివాదగ్రస్తమగు బిల్లును బలపరచుచో, అప్పటికిని నూతనముగా యేర్పడిన సెనెటుసభవారద్దాని నిరాకరింపుచో, గవర్నరుజనరలుగారు ఇరు సభాసమ్మేళన మొనర్చనగును. ఆసమ్మేళనసభవారు, ఆ బిల్లును పూర్తిగా విచారించి, తుదకు దానిపై "వోటు" నెత్తవచ్చు