పుట:Adhunikarajyanga025633mbp.pdf/262

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జర్మను రైషులైర్ అనుపెద్దల సభయందు వివిధసభ్య రాష్ట్రప్రభుత్వముల ప్రతినిధులే, సభ్యత్వముబొందియుందురు గనుక,

జర్మని.

రైష్‌టాగ్ నందలిసభ్యులకన్న ధైర్యము పట్టుదల వారికుండజాలవు. ప్రజాప్రతినిధులముందు ప్రభుత్వనియామకులెట్లు ప్రజాభిప్రాయముగురించి తర్కించగలరు? కనుకనే ఈరెండు శాసనసభలమధ్య భేదాభిప్రాయముకల్గుచో, "రైష్‌రాత్" వారు 'రైష్‌టాగ్‌' వారిచే వివాదగ్రస్థమైనబిల్లు అంగీకరింపబడిన పదునైదుదినములలో తమ అభ్యంతరమును ప్రభుత్వమునకు తెలియపరచవలయును. రిపబ్లికుప్రెసిడెంటుగారు, అట్టిఅభ్యంతరము బయలుదేరిన మూడుమాసములలో ఆబిల్లును 'రిఫరెండము'నకు తేవచ్చును. ఆతడట్లు 'రిఫరెండము' కోరనిచో ఆబిల్లు శాసనము కా జాలదు. కాని, మూడింట రెండువంతులుగా రైష్‌టాగ్ వారట్టిబిల్లు అత్యవసరమనియు, రైష్‌రాత్ వారి అభ్యంతర మనవసరమనియు తీర్మానించుచో, మూడుమాసములు లోగా ప్రెసిడెంటుగా రట్టిబిల్లును శాసనముగానైన ప్రకటించవలెను. లేదా, "రిఫరెండము"న కద్దానిని తేవలయును. 'శాసననిర్మాణమును రైష్‌టాగ్‌వారు చేయుదురు.' అను చట్టపుప్రకటనయే, 'రష్‌రాత్‌' యొక్క నిర్బలత, నిస్సారత తెల్పుచున్నది.