పుట:Adhunikarajyanga025633mbp.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కెనడా దేశమందు సమ్మేళనరాజ్యమున సెనేటు సభ కలదు. అందు ఒక్కొక్క రాష్ట్రమునకు 24 సభ్యులు చొప్పున మొత్తము

కెనడా.

72 సభ్యులు ప్రధమమునకలరు. కాని, అందలి సభ్యుల నెల్లర తాత్కాలికముగా పెత్తనమందున్న మంత్రివర్గమువారు అవసరముకల్గి నప్పుడెల్ల జీవితాంతమువరకు ముప్పదివత్సరముల వయస్సు మించినవారిని ఆస్థిపరులగు వారిని సెనెటుసభ్యులుగా నియమించనగును. అవసరమగునప్పుడెల్ల ఆర్గురు క్రొత్తసభ్యుల నియమించుటకు ప్రభుత్వమునకు హక్కుకలదు. మొత్తముమీద డెబ్బదియెనిమిదిసభ్యులకు మించకుండ నుండవలయును. కనుక మంత్రివర్గమువారిచే ప్రతిపాదింపబడు బిల్లులను ప్రజాప్రతినిధిసభవా రంగీకరించినపిమ్మట చర్చించి సాధారణమార్పుల సూచించుటకే సెనెటుసభవారికి ధైర్యముండునుగాని, ప్రజాప్రతినిధిసభవారిచే తిరిగి బలపరుపబడు బిల్లు నెదిరించుటకు ధైర్యముకలుగజాలదు. కనుక ఇంగ్లాండునందు ప్రభువులసభ తాత్కాలికముగా, మంత్రివర్గపుశాసన నిర్మాణకార్యక్రమము నాపుటకు శక్తికల్గియుండ జర్మనీయందు నట్లే రైష్‌టాగ్ వారి బిల్లులు శాసనములు గాకుండజేయుటకై తాము అభ్యంతరముల బెట్టిగాని, "రిఫరెండము" కోరిగాని, అడ్డంకులు బెట్టుటకు "రైష్‌లైల్" న కవకాశముండ కెనడాయందు మంత్రివర్గముచే ప్రవేశబెట్టబడి ప్రజాప్రతినిధిసభవారిచే నామోదింపబడిన బిల్లుల నిరాకరించుటకు,