పుట:Adhunikarajyanga025633mbp.pdf/250

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నడుపబడు వాణిజ్యములు హెచ్చుచుండుటయు, దానిచే పరీక్షింపబడు అదుపాజ్ఞలం దుంచబడువాణిజ్య వ్యాపారముల ప్రాముఖ్యత హెచ్చుటయు, ప్రభుత్వమునుండి రక్షణగోరు ప్రజాసమూహములు వృద్ధిబొందుచుండుటయు, దానిద్వారా తమతమ జీవితములు శుభప్రదముగాజరుగుట కవసరమగు శాసనముల సృష్టించవలసియుండుటయు తటస్థించుచున్నది. ఇట్టి ప్రభుత్వమును సాగించు మంత్రివర్గముయొక్క యాధిపత్యమును కడుంగడు జాగరూకతతో, పరీక్షించుచు, ప్రజాభిప్రాయము ననుసరించియే రాజ్యాంగము నడుపబడునట్లు చేయుధర్మము, ప్రజాప్రతినిధిసభవారిపై యున్నది. ఈధర్మమును సంతృప్తికరముగా, శక్తివంచనలేకుండ నడపుటకే, ఆసభవారి శక్తియుక్తులన్నియు, వ్యవధిఅంతయు నుపయోగపరుపబడుచున్నవి. ఇకనీప్రభుత్వ వ్యవహారములకే సంబంధించిన శాసననిర్మాణకార్యమును నిర్వర్తించుచు, ప్రజలయొక్క సాంఘికార్థిక రాచకీయజీవితమునకును, రాజ్యాంగపుటేర్పాటునకును తగుసంబంధము నేర్పరచుట కగత్యమగు శాసన నిర్మాణ మొనర్చుటకు తగువ్యవధి, సావకాశము, ప్రజాప్రతినిధిసభకు కల్గుట దుస్తరమగుచున్నది. కనుక, ఈకార్యనిర్వహణమందు, ప్రజాప్రతినిధిసభకు తగుపాటిసహాయము చేయుటకు సెనేటుసభయుపయోగమేమో విచారించుట అప్రస్తుతము కాదు. వర్తక వాణిజ్యవ్యవహారములకు సంబంధించినంత