పుట:Adhunikarajyanga025633mbp.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముగా వ్యవహరించుట లేదు. బిల్లులు ప్రజాప్రతినిధిసభవారిచే యంగీకరింపబడినట్లే తుదకు శాసనరూపముదాల్చును. కాని లిబరలుపార్టీకాని, లేబరుపార్టీగాని పెత్తనమున కొచ్చినచో, వెంటనే సెనెటుసభవారు నిద్రనుండి మేల్కొన్న కుంభకర్ణునివలె శరపరంపరలుగా ప్రజాప్రతినిధిసభవారి బిల్లుల నన్నిటి అసందర్భముగా, అన్యాయముగా, అక్రమముగా విమర్శించ బూనుకొని ఎన్నిటి నిరాకరింతుమా యను యాతురత బొందుచుందురు. కనుక ఈసభవారు శాసన నిర్మాణకార్యమునందు, ప్రజాప్రతినిధి సభవారికి చేదోడై తమయనుభవము కార్యచతురత నుపయోగించి ప్రజలకు వలయు శాసనముల నిర్మించుటకు తోడ్పడుటకుమారు, తమ కయిష్టమగు మంత్రివర్గమువారి శాసననిర్మాణకార్యక్రమ విధానమును విధ్వంసమొనర్చుటకే బూనుకొనుచుందురు. కాననే అనేక రాజకీయజ్ఞులు సెనెటుసభవారి కనుకూలమగు పార్టీ రాజ్యాధికారమందున్న కాలమం దనవసరమగుననియు వ్యతిరేకమగు పార్టీ మంత్రివర్గమేర్పరచిన ప్రతిష్టంభన జేయునుగాన, నష్టదాయకమనియు వాదించుచున్నారు.

ఐనను ప్రజాప్రతినిధిసభవారికి ఈకాలముబట్టి అగత్యమగుచుండు శాసనముల నిర్మించుటకు తగుపాటి వ్యవధి కల్గుటలేదనిమాత్రము ఎల్లరంగీకరింపక తప్పదు. నానాటికి ప్రభుత్వపు కార్యవిధానము క్లిష్టతరమగుచున్నది. ప్రభుత్వముచే