పుట:Adhunikarajyanga025633mbp.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాన్యమునకు అంగీకృతమగు బిల్లులనే ప్రవేశపెట్టించుటకు బ్రయత్నించుచుండును. అందేబిల్లుపైకాని వివాదముకల్గి ;జనరలుఎన్నికలు' వచ్చుచో ప్రజలు తమ పరమైయుండుటకే వారాశించుచుందురు. కనుక, బాధ్యతరహితముగా అనవసరమగు ప్రజలచే వాంఛింపబడని ప్రజానాయకులచే నిరోధింపబడుబిల్లులను ఆమెజారిటీపార్టీవారు ప్రజాప్రతినిధిసభయందు ప్రవేశపెట్టించుటకొప్పుకొనరు. మంత్రివర్గమును ప్రభుత్వ కార్యనిర్వహణమందు తగిన అనుభవమును బొందుచుండును. కనుక ప్రభుత్వవ్యవహారములకు తగినట్లుగా ప్రజాభిప్రాయానుసారముగా నుండునట్టి బిల్లులనే తయారుచేయుటకు సంసిద్ధమగును. ఈ మెజారిటీపార్టీ వారి నెదిరించుచు మంత్రివర్గపు చర్యల విమర్శించుచు చేయబడుచున్న, చేయబడనున్న, దుష్కార్యముల ప్రజలకయిష్టమగు బిల్లుల జాగ్రత్తగా సహేతుకముగా చర్చించుటకు మైనారిటీపార్టీ యెల్లప్పుడు కాచుకొనియుండును, కనుక, ప్రజాభీష్టమున కెదురైన ప్రతిబిల్లును ఎదిరించి దానిపై ప్రజలకుండు వైమనస్యతను వృద్ధిపరచి బహిరంగముగా ప్రజాభిప్రాయమును ప్రకటింపజేసి తప్పుదారులబడిన మంత్రివర్గమును దానికాధారమగు మెజారిటీపార్టీని ప్రజాసంఘమధ్యమందు అప్రతిష్ట పాలగునట్లుచేయుటకు మైనారిటీపార్టీ అనిశము వేచియుండును. ఇట్టిస్థితిగతులందు మెజారిటీయందుంటిమిగదా యను గర్వముతో ఏపా