పుట:Adhunikarajyanga025633mbp.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ర్టీయు, తన మంత్రివర్గముద్వారా ప్రజాసామన్యమునకు కంటగింపుకల్గించు బిల్లుల ప్రజాప్రతినిధిసభయందు ప్రవేశ పెట్టించుటకు సాహసించజాలదు. కనుకనే, సర్వసాధారణముగా ప్రజాప్రతినిధిసభవారు బాధ్యతనుమరచి ప్రజల కగత్యమగు బిల్లుల నంగీకరించుట తటస్థించదని చెప్పుటకు సాధ్యమగుచున్నది.

రెండుసభలనుకల్గిన రాజ్యాంగములందును ఒక్కొక్కప్పుడు అనవసరమగునట్టివేకాక, అపకారముకల్గించునట్టి శాసనములుకూడ నిర్మింపబడుట కాననగును. మనుష్యులచే జేరిన శాసనసభలు, మనుష్యులవలెనే, అప్పుడప్పుడు, పొరపాటులొనర్చుచుండుట సహజమే. కాని, ఒక్కసభవారొనర్చినపొరపాటునే, రెండవసభవారును జేసిరన్న ప్రజాప్రతినిధిసభయొక్కటియే తప్పిదమొనర్చుననియు, ఆతప్పుల దిద్దుటకు "పెద్దలసభ" యవసరమను వారివాదము బలహీనతపొందుట లేదా?

మరియు, సెనేటుసభ వారు ప్రజలకు ప్రజాప్రతినిధిసభవారివలెనె అంతగా బాధ్యతబొందియుండరు. ప్రజలును మంత్రాంగవర్గము నేర్పరచి ప్రభుత్వమును సాగించుట కధికారముబొందియున్న ప్రజాప్రతినిధిసభపై హెచ్చుశ్రద్ధజేయుచుందురుగాని, మంత్రాంగవర్గమువారిచే ప్రతిపాదింపబడు