పుట:Adhunikarajyanga025633mbp.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నమ్మకముండుటవలననే అనేక ప్రజాప్రతినిధులు వానికి సుముఖముగా తమవోటులనిచ్చిరని కూడ జూపెట్టసాధ్యమగును. తాముచేయదగు కార్యమును మరొకరు సరిజూడనగునని తలంచునంతవరకు తమచే నంగీకరింపబడిన బిల్లుల నిరాకరించుటకు, అట్టికార్యమునకు బాధ్యతవహించుటకు మరొక సభవారు కలరను తలంపుకల్గువరకు ప్రజాప్రతినిధిసభ బాధ్యతకల్గి ప్రవర్తించుట దుస్తరముగదా? తాము ఆయాబిల్లుల నంగీకరించి వానిని బలపరచు ప్రజలనమ్మికను జూరగొని, ఆబిల్లుల నిరాకరించు సెనేటుసభపై నిందమోపుటకు వీలున్నంతవరకు ప్రజాప్రతినిధిసభవారు బాధ్యతకల్గి తమ విధిని నిర్వర్తింపకున్న ఆశ్చర్యమేమి?

బాధ్యతలేకుండా ప్రవర్తించుట కిట్టిసదుపాయమున్నను ఈకాలపు శాసనసభలయందలి ప్రజాప్రతినిధిసభలు సాధ్యమైనంతవరకు బాధ్యతకల్గియే ప్రజలయొక్క నిజాభిప్రాయముల కన్గొనియే ప్రజలక్షేమాభివృద్ధి కారకమగునట్టి బిల్లులనే అంగీకరించుచున్నవని చెప్పకతప్పదు. అందులో నాశ్చర్యమేమియు లేదు. ప్రజాప్రతినిధిసభవారు తమనడతకు తాము బిల్లులయెడజూపువైఖరికి తమచే నిల్పబడు ప్రభుత్వపుచర్యలకు ఆప్రభుత్వముచే ప్రతిపాదింపబడు బిల్లులకుగాను ప్రజాసామాన్యమునకు బాధ్యతవహించవలసియున్నది. మెజారిటీ యందున్న పక్షమున తన మంత్రివర్గముద్వారా ప్రజాసా