పుట:Adhunikarajyanga025633mbp.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వారి అనుయాయుల ప్రాపకము నిలబడియుండుటయు, మంత్రివర్గములు వారికేలోబడియుండి ప్రజాప్రతినిధి సభలయందలి అధికసంఖ్యాకులగు సభ్యులు వారిపై ఆధారపడియుండుటయు అనుభవసిద్ధమైయున్నది. లేబరుమంత్రివర్గముల ననుభవించిన ఆస్ట్రేలియా, ఇంగ్లండు, జర్మనీదేశములయందును, ఆమంత్రి వర్గములు పతనమొందినపిమ్మట పెత్తనమునకొచ్చిన ధనికుల మంత్రివర్గములే హెచ్చుకాలము రాజాధికారముబొంది యుండుటయు, లేబరుమంత్రివర్గములు పాటకపుజనులకు సుముఖమౌ కార్యముల నెరవేర్చుటకు శాసనముల నిర్మించుటకు కల్గినయవకాశములకంటె ధనికుల మంత్రివర్గములకే హెచ్చు యవకాశములు కల్గుచుండుటయు చరిత్రప్రసిద్ధము. లేబరుపార్టీ వారు, మెజారిటీయందుండినకాలమున ఏదేశపు ప్రజాప్రతినిధిసభయందైనను, అయుక్తమగునట్టిగాని, అధర్మమైనట్టిగాని, ధనికుల పతనమును అతిత్వరితముగా కల్గించునట్టిగాని, బిల్లులుకాని, కార్యప్రణాళికలుగాని, అంగీకరింపబడి యుండలేదు.

మరియు, ప్రజాసామాన్యమునకంతకు వోటుహక్కు వచ్చి ఏబదివత్సరములైనను ఇంగ్లండునందలి పార్లమెంటులో మెజారిటీని ఈనాటికి లేబరుపార్టీ సంపాదింపలేకున్నది. ఆస్ట్రేలియాయందలి సమ్మేళనరాజ్యాంగమందును, రాష్ట్రీయ ప్రభుత్వములందును, లేబరుపార్టీ సుగమముగాగాని, సంపూర్ణము