పుట:Adhunikarajyanga025633mbp.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దలి అనేక రాష్ట్రియశాసనసభలవలె స్థానికముగా ప్రాధాన్యతవహించియుండు ధనికులు కర్మాగారాధిపతులు జమాందారుల మాటలకులోనై, వారి ప్రతిభకుదాసులై శాసనసభాసభ్యులు అల్పసంఖ్యాకులకు, కొందరువ్యక్తులకు, ఏకంపెనీకో, ఏవాణిజ్యాధికారులకో ప్రత్యేకలాభముల కల్గింపబూనుకొని, ప్రజాసామాన్యపు లాభనష్టములలెక్కింపక ప్రజాస్వత్వముల వమ్ముజేసి అనర్ధదాయకమగు శాసనముల ప్రజాప్రతినిధి సభలు అంగీకరించునేమో యను భయముచేవారు పీడింపబడుచున్నారు. అనుభవమందనేక శాసనసభలిట్లు దుర్మార్గముగ ప్రవర్తించియుండుటచే, వీరిభయసంభ్రమములు భ్రమ ప్రమాదములని చెప్పుటకు వీలు లేదు.

ముందుగా, ధనికులు, భూస్వాములు, తదితర స్వసంఘస్వత్వములకై యాతురతజెందువారికి ఎట్టిసమాధానము సాధ్యమో విచారింతము. ప్రజాస్వామిక రాజ్యాంగము, వివిధదేశములం దేర్పరచబడినపిమ్మట ఎచ్చటను, ప్రజాప్రతినిధిసభ అల్పసంఖ్యాకులగు యీధనికులు, భూస్వాములు, కర్మాగారాధిపతులయొక్క న్యాయమగునట్టిగాని, ఆచారముచే బలపరపబడినను అన్యాయమగునట్టిగాని హక్కులను, అకస్మాత్తుగాగాని, త్వరితముగాగాని, పూర్తిగాగాని, భంగపరుపజాలినదని చెప్పజాలము. జనబాహుల్యము, బీదలకే జెందియున్నను, అన్ని దేశములందును, హెచ్చుగా ధనికుల,