పుట:Adhunikarajyanga025633mbp.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గాగాని, ఆధిక్యతపొంద లేకున్నది. జర్మనీ ఫ్రాన్సుదేశములందింకను లేబరుపక్షములు తమంతతామే మంత్రివర్గముల నేర్పరచుయోగ్యత పొందజాలకున్నవి. వార్తాపత్రికాబలము పార్టీనిధులబలము ధనాడ్యులగు అభ్యర్థులబలము పార్టీప్రచారబలము ధనాథికులపక్షములగు కన్సర్వేటివు లిబరలుపార్టీలకున్నట్లు లేబరుపార్టీ వారికేదేశమందును కలుగుట లేదు. పేరునకు అల్పసంఖ్యాకులైనను ధనికులప్రాపకము అత్యధికమని అనుభవమే నిరూపించుచున్నది. బీదలైయున్న ప్రజలందు (అందుముఖ్యముగా స్త్రీలలో) ధనికులన్నను, వారిఆచారములన్నను, వారిమాటలన్నను, వేషములన్నను, అత్యంతమగు భ్రాంతివ్యామోహతకలదు. ప్రతికార్మికుడును స్వతంత్రుడు కాగోరుచుండును. ప్రతికార్మికుని భార్యయు, ధనికురాండ్రవేషభాషలననుకరింప బ్రయత్నింపుచుండును ప్రతికార్మికకుటుంబమును ధనికులుకాగోరుచు, ధనికులహక్కుల హెచ్చుజేయ నిచ్చగించుచు, ఎప్పటికైన ధనికులమనిపించుకొన గోరుచుండును. మధ్యతరగతివారు కార్మికులతక్కువగా జూచుచు, ధనికులవేషముల ననుకరింపుచు, తామును ధనికులమనే భ్రమయందుమున్గితేలుచు, తాము పడిమొల్చినవారము కామని గర్వించుచు, ఎల్లప్పుడు భూస్వాములు తదితర పురాతన కుటుంబీకులమనుకొనువారితో సంబంధబాంధవ్యములు నేర్పరచకొనగోరుచుందురు. కనుక ప్రతిసంఘమందును, అధోగతి