పుట:Adhunikarajyanga025633mbp.pdf/234

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కులగు ధనికులు, భూస్వాములు, నాయకులు, యజమానులు విద్యాధికులహక్కుల నిర్మూలన మొనర్చి, ఆస్థిపాస్థుల హక్కు భుక్తముల పంచుకొనగోరి, స్వాపరాధమును శాసననిర్మాణముద్వారా కల్గించుకొనగోరెదరుకాన, వారి అవిచారతను ఆపి, సంకుచితదృక్పథమును చంపి, శాంతమును, ఓర్పును, న్యాయమును ప్రచారిత మొనర్చుటకు సెనేటుసభ యవసరమని వారు తలంచుచున్నారు.

మితవాదులగు రాజ్యాంగవేత్తలు రాజ్యాంగవ్యవహారములు రానురాను క్లిష్టతమమగుటచే వానిని జాగ్రత్తగ విమర్శించి, మంచిచెడ్డలనాలోచించి యుక్తమగు కార్యవిధానము నిర్ణయించి, దాని నమలులోపెట్టుటకు తగు మంత్రివర్గమును నిర్మించి, దానిని పెత్తనమందు కొంతకాలమువరకు నుంచి, ఆమంత్రివర్గపు కార్యముల జాగరూకతతో విమర్శించుచు, మంత్రుల అదుపుఆజ్ఞలందుంచి, ప్రజాభిప్రాయమును పాటించునట్లుచేయుటకే ప్రజాప్రతినిధిసభవారి కాలమంతయు వ్యయమగుచున్నది కనుక, శాసననిర్మాణమునకు తగిన సావకాశము కల్గుటలేదని చెప్పుచున్నారు. రాచకీయపక్షములు బలిష్టతబొంది, ప్రజాప్రతినిధిసభయందు పక్షములకార్యప్రణాళికల ననుసరించి దీర్ఘమగుచర్చల జరుపకుండనే ప్రజాప్రతినిధులకు స్వతంత్రముగా ఆయాబిల్లుల విచారించుట కవకాశము కల్గించకుండనే బిల్లుల సభవారిచే నంగీకరింపజేయుట