పుట:Adhunikarajyanga025633mbp.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దధిక సంఖ్యాకులు గమనించరైరి. ప్రజలయందు ప్రజ్వలించుచుండు సంస్కరణాభిలాషలు అతి త్వరితముగ శాసనరూపము దాల్చకుండుటకే రెండవసభను నిర్మించుట తగునను యభిప్రాయమునకు వారు లోనగుచుండిరి. ఇతరదేశములందు రెండుసభలగత్యమని తలంపబడుచుండ తమకుమాత్రము అవసరము కావాయని కొందరు వాదించుచుండిరి. ఎటులనెననేమి ఇప్పటికి అధిక సంఖ్యాకమైన రాజ్యాంగములందు రెండు శాసనసభ లేర్పరచబడియున్నవి.

ఆధునిక రాజ్యాంగావసరములబట్టి, ఎంతవరకు సెనేటు సభ (పెద్దలసభ) అవసరమో ఆలోచించుదము. శాసననిర్మాణమునకై ఈసభ యగత్యమా? ఇప్పటి కధికారమందున్న ధనికులు, భూస్వాములపక్షీయులు, మితవాదులు, ప్రజలన్న భయమొందువారు సెనేటుసభ యగత్యమని వాదింతురు. ప్రజలు రాచకీయానుభవములేనివారుగనుక స్వార్థపరులగు లేక అవిచారులగు లేక అనుభవరహితులగు ప్రజానాయకుల బోధలకు తలలొగ్గి, త్వరపడి వేలం వెర్రిగా అనగత్యమగు, అపాయకరమగు, అన్యాయము వృద్ధిగావించుశాసనములను, తమ ప్రజాప్రతినిధిసభద్వారా నిర్మింతురని వీరు వా కొనుచున్నారు. నిర్ధనికులు అధిక సంఖ్యాకులు గనుకను, కార్మికులు రాచకీయవిజ్ఞానరహితులుకానను తృటిమాత్రమున భూలోకము స్వర్గప్రాయముగ జేయుట సాధ్యమనినమ్మి అల్పసంఖ్యా