పుట:Adhunikarajyanga025633mbp.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సులభమగుచున్నదందురు. మరియు, మంత్రివర్గమువారికి జెందిన మెజారిటీపార్టీవారు తమ మంత్రివర్గమువారు ప్రవేశపెట్టు బిల్లులను, దీర్ఘ విమర్శనలకు లోనుగా జేయకుండనే మైనారిటీపార్టీ వారికిగూడ నట్టిబిల్లులను తగినట్టు విమర్శించుట కవకాశముకల్గించకుండనే శాసనసభ వారిచె నంగీకరింపబడునట్లు చేయుచుందురు. మంత్రివర్గమువారికి గత్యమగు, శాసనసభవారి అనుమతిబొందనగు వ్యవహారముల చర్చించుటకే, సభవారి వ్యవధినెంతో, మంత్రివర్గమువారు స్వీకరించుటచే బిల్లుల చర్చించుటకుగల వ్యవధితగ్గుచుండుటయు, ఆవ్యవధియందే, ఏయేబిల్లులచర్చించుట కెంతకాలము సభవారు ఉపయోగించనగునో, మంత్రివర్గమువారే నిర్ణయించుచుండుట ప్రజాప్రతినిధిసభకు బాధ్యత వహించు మంత్రివర్గముల బొందిన, బ్రిటిషు ప్రజాస్వామిక రాజ్యములు, ఫ్రాన్సు, జర్మనీదేశములందును ఆచారమైయున్నది. కనుక అవ్యవధిగా అసంతృప్తికరముగా, అసంపూర్తిగా చర్చింపబడిన బిల్లులు సెనేటుసభ వారిచేపునర్విమర్శింపబడక పూర్వమే శాసనములుగా ప్రకటింపబడుట యుక్తముగాదని ఈమితవాదులు తలంచుచున్నారు. వీరివాదము పూర్తిగా దుర్బలమైనదనిగాని స్వలాభప్రేరితమైనదని గాని చెప్పుటకుసాధ్యపడదు.

ప్రజాస్వత్వవాదు లేకొందరు ప్రజాప్రతినిధిసభయొక్క అసమర్థత గురించి చాలవిచారపడుచున్నారు. అమెరికాయం