పుట:Adhunikarajyanga025633mbp.pdf/222

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డునందు మంత్రులపదవికి ఆసపడుటపొసగదు. ఇంగ్లాండాదిగాగలదేశములందు మంత్రివర్గమునందు జేరదగువారెవ్వరో శాసనసభలే తేల్చుచుండును.

ప్రజలయవసరముల దీర్చుటకు ప్రజాభిప్రాయముననుసరించి తమకుతోచినరీతి కొంతకాలము ఒకపక్షమును మరి కొంతకాలము మరొకపక్షమును మంత్రివర్గము నేర్పరచుట కధికారిగా జేయుట శాసనసభవారి ధర్మమైయున్నదిగదా! పెత్తనమందున్న మంత్రివర్గము అసంతృప్తికరముగా నుండుచో, దానిపిమ్మటవచ్చుమంత్రివర్గము సంతృప్తికరముగా నుండవలెనన్న దానిని నిర్మించురాచకీయపార్టీ వారియొక్క కార్యప్రణాళికను పరీక్షించి దానినాయకుల బాగుగానెరుంగుట, శాసనసభయొక్కధర్మము. వివిధపక్షముల ప్రవర్తనమును వాని నాయకుల శక్తియుక్తులను జాగ్రత్తమై శాసనసభ పరీక్షించుచుండును. ఈయత్యవసరమగు పరీక్షను ప్రజలు తమంతతామే చేయజాలరు. వారికికావలయునదెల్ల పెత్తనమందున్న మంత్రివర్గము సంతృప్తికరముగా, శోభాయమానముగా రాజ్యముచేయుటయే! వారి యామోదమునకై వివిధరాచకీయపక్షములు తమనాయకులను జూపెట్టుటకు తమరాజ్యాంగప్రణాళికల ప్రకటించుటకు శాసనసభలు, ప్రదర్శనశాలలు. ఆపక్షములు తమసభ్యులకు వారివారి సత్తాలను జూపెట్టి ప్రజాసేవచేయుటయందు అనుభవము బొందుటకు శాసన