పుట:Adhunikarajyanga025633mbp.pdf/223

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సభలు గొప్పరాచకార్యపు విద్యాలయములు. వివిధమంత్రివర్గములకువలయు సభ్యులతయారుచేసి జాతీయావసరముల దీర్చుటకు నాయకుల సదా సమకూర్చుటకు శాసనసభలు నాయకాగారములు.

X

అమెరికాయందు తప్ప, మిగతా బాధ్యతాయుతమంత్రివర్గముల బొందియున్న ప్రజాస్వామిక రాజ్యాంగములందు శాసనసభలే, ప్రభుత్వకార్యనిర్వహణమునకు, అవసరమగు ధనమును, ప్రతివత్సరము, ప్రజలనుండి రాబట్టుటకు, శిస్తుల వేయుచుండును. మనదేశమందు, ఆదిమ కాలమందె, పండినపంటలో ఆరవభాగమును రైతులనుండి, రాజు రాబట్టుకొనవచ్చునని ధర్మశాస్త్రములందు నిర్ణయింపబడెను. అటులనే, శాశ్వతముగా, చైనాదేశమందును, ప్రభునకు ప్రజలు చెల్లింపదగు శిస్తులను, శ్రీకన్ఫ్యూషస్ గారికి పూర్వమే సిద్ధాంతీకరింపబడెను. ఇందువలన, ప్రభుత్వముజేయుచుండిన రాజులీదేశములందు ప్రతివత్సరము, శిస్తుల వేయుటకై ప్రజల పిలువనంపి, వారియంగీకారమును బొందనవసరము లేకుండెను. కాననె, వివిధరాజులు, అనేకమారులు, ఆదేశములందు రాజ్యాధికారమును, నిరంకుశముగా, నడపగల్గిరి.

ఇంగ్లాండునందిట్లుకాక, ప్రథమమునుండియు, భూస్వాముల సమ్మతిపైననె, రాజు శిస్తుల వేయుట కధికారము బొందియుండెను. నిరంకుశముగా శిస్తులవేయబూనిన శ్రీజాను