పుట:Adhunikarajyanga025633mbp.pdf/221

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లందు పేరుబొందిన నాయకులమంత్రులుగా నియమించుట జరిగెనుగాని ఆప్రయత్నములన్నియు అపజయమునే కూర్చెను. ఇందులకు కారణము మంత్రులుగా నుండదగువారు తమకుస్వాధీనపరచబడిన డిపార్టుమెంటుల సివిలుసర్విసు యుద్యోగులవలె నడపుటకాక ప్రజాభిప్రాయముననుసరించి తగులాభముల నాడిపార్టుమెంటులద్వారా కల్గించవలెను. అందులకు పార్లమెంటునాయకులె సమర్థులు. ఆమంత్రులు తమకుశాసనసభవారొసంగు సందేశముననుసరించి డిపార్టుమెంటును నడపించుటయే కాక అనుభవరీత్యా తమకు తోచినమార్పులను పార్టీయొక్కయు, శాసనసభయొక్కయు, కార్యప్రణాళికలయందు మార్పులచేయింపగల్గు శక్తికలవారై యుండవలెను. ఇందులకు శాసనసభానాయకులే తగినవారు.

శాసనసభలద్వారా తప్ప తమ్ము ఇకముందు ఎవ్వరు పాలింపబోవుచున్నారో ప్రజలు తెలుసుకొనుట దుర్లభము. మంత్రివర్గమందున్న పార్టీతమకిష్టముకానిచో ప్రత్యర్థిపక్షీయుల నాయకులెవ్వరో ప్రజల కెరుకపడుటకు శాసనసభలుపయోగపడును. కానిచో ఇటలీయందు ముస్సోలీనీగారు పోయినపిమ్మట మరల నెవ్వరు నాయకులన్న, ఇటాలియనులెట్లు సమాధాన విరహితులగుచున్నారో అటులనే ఎల్ల దేశములవారును, ఏమితోచక యుందురు. అమెరికాయందువలె ఎల్లరకు తెలియనివ్యక్తులు ప్రెసిడెంటుపదవికి అభ్యర్థులగునట్లు, ఇంగ్లం