పుట:Adhunikarajyanga025633mbp.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లను" ప్రతిదేశమందును ప్రతిపట్టణమందు నేర్పరచి ఎల్లప్పుడు ప్రజలయందాందోళన కల్పించుచుండు సమస్యలచర్చించుటద్వారా ప్రజలకు రాచకీయవిజ్ఞానము కల్గించుటయేకాక వారికి యుక్తాయుక్తవిచక్షణ జ్ఞానముకల్గించి ఇట్టిసభలకు మాతృకలగు శాసనసభలపై, ప్రజలకు శ్రద్ధకల్గించనగును.

ప్రజలు రాజకీయవ్యవహారములను గురించి తగుభోగట్టాతెలుసుకొననిదే, ఏరాచకీయపార్టీ వారెంతవరకు తమవిధికృత్యమును నెరవేర్చిరో, ఏమంత్రివర్గమెట్లు ఏయేవిషయములందు ప్రవర్తించినదో గ్రహింపజాలరు. రాచకీయసమాచారముల నెరుంగనిప్రజలు, ఎన్నికలందు సక్రమముగా ఎటుల తమవోటుహక్కు నుపయోగించకలరు? కనుక ప్రజలకు రాచకీయవిజ్ఞానమును కల్గించి, ప్రభుత్వపుచర్యలగురించి తగినట్లు తెలియజెప్పుటకు, శాసనసభ యుపయోగపడవలెను. ఇందులకు వివిధరాచకీయపార్టీలు తోడ్పడుటవసరము. వార్తాపత్రికలు శాసనసభలచర్యలను సంపూర్ణముగా ప్రకటించవలెను. "పౌరసభల" ద్వారా, అన్నియెడల ప్రజలకు మంచిచెడ్డలు తెలియునట్లు వివిధరాచకీయపార్టీలు ప్రయత్నించవలెను.

IX

శాసనసభలకు బాధ్యతవహించు మంత్రివర్గములబొందిన ప్రజాస్వామిక రాజ్యాంగము లన్నిటియందును, ప్రజానా